ద్వారకా వెంచర్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

ద్వారకా వెంచర్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

  • రూ.90,999లకు లడ్డూ కైవసం చేసుకున్న బుడికె గంగా జీవన్ దంపతులు
  • ఉత్సవాలలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు ఎన్.సి. సంతోష్

సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ద్వారకా వెంచర్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి నిర్వహించిన వేలం పాట భక్తుల సందడి నడుమ పోటాపోటీగా సాగింది. ఈ వేలం పాటలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనగా, చివరకు బుడికె గంగా జీవన్ దంపతులు 90,999 రూపాయలు చెల్లించి స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గంగా జీవన్ మాట్లాడుతూ గణపతి లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆ లంబోదరుడి దివ్య కృపతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, సిద్దిపేట జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్ మాట్లాడుతూ గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆధ్యాత్మిక శోభతో, అత్యంత ఘనంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వామివారిఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, కమిటీసభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

Views: 36

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ