50 ఏళ్ల బావి.. ఇంకెన్నాళ్లు..?

50 ఏళ్ల బావి.. ఇంకెన్నాళ్లు..?

  •  చైర్‌పర్సన్ చెప్పినా.. కమిషనర్ పట్టించుకోరా..?
  • పాత బావి సమస్యపై కమిషనర్ నిర్లక్ష్యమా..?
  • ఫిర్యాదులు వెళ్లినా.. చర్యలు ఎక్కడ..?
  • పాములు, దోమల బెడదతో కాలనీవాసుల ఆందోళన..
  • బావిని పూర్తిగా పూడ్చివేయాలని మహిళల ఆందోళన..

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25వ వార్డు నాగులమ్మ గుడి సమీపంలో సుమారు 50 ఏళ్లుగా ఉన్న పాత బావి స్థానికులకు ఇబ్బందికరంగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న బావిలో పాములు సంచరిస్తుండటంతో పాటు దోమల బెడద కూడా పెరిగిందని తెలిపారు.దీంతో బావి పరిసరాల్లో నివసించే ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.సమస్య పరిష్కారం కోసం శనివారం బావి వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో నిలబడి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బావి చాలాకాలంగా నిరుపయోగంగా ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని చెప్పారు. రాత్రివేళల్లో మధ్యలో ఉన్న బావి వైపు వెళ్లాలంటే భయంగా ఉంటోందని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.బావిలో పాములు సంచరిస్తున్నాయని, దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని చెప్పారు.బావి చుట్టూ భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బావి సమస్యను 25వ వార్డు కౌన్సిలర్‌ స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కాలనీవాసులు తెలిపారు. వెంటనే సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌కు తెలియజేసిన కూడా పట్టించుకోవడం లేదని స్థానిక కౌన్సిలర్, ప్రజలు  తెలియజేస్తున్నారు.కమిషనర్ కు చెప్పిన ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని వారు చెబుతున్నారు. అధికారులు స్పందించి స్థలాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే బావిని పూర్తిగా పూడ్చివేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. బావిని పూడ్చివేసి ప్రజలకు ప్రమాదం లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.నాగులమ్మ గుడికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బావి సమస్యను పరిష్కరించాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బావిని పరిశీలించి, ప్రజల భద్రతకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో మడ్డి వెంకన్న, స్వప్న, కల్పన, చిలుకమ్మ, నాగమణి, పూర్ణిమ, ఉష, రేణుక, రాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-26 at 2.48.54 PM

Views: 191

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ