వీర నారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో

వీర నారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో

- ఘన నివాళులు అర్పించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆదిలాబాద్ బ్యూరో :తెలంగాణ ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రిమ్స్ హాస్పిటల్ ముందర, ఆర్.యస్. ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వీర నారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, అడిషనల్ కలెక్టర్ చిత్రు ల తో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అటు రిమ్స్ ఎదురుగ ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సోనియా, రజక సంఘం నాయకులు దత్తు , రజక సంఘం అధ్యక్షులు కార్తీక్, మహిళా అధ్యక్షురాలు రమక్క, వేముల నాగరాజ్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ