నవ చైతన్య యూత్ గణేష్ ని దర్శించుకున్న బీజేపీ నాయకులు
నల్గొండ /మర్రిగూడ:మర్రిగూడ మండలం కేంద్రంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతు న్నాయి.ఈ వేడుకల్లో భాగంగా పలువురు ప్రముఖ బీజేపీ నాయకులు విఘ్నేశ్వరుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో మండల ప్రజలంతా సుఖసంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇలాంటి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని కొనియాడారు. యూత్ సభ్యులు చేస్తున్న ఈ వేడుకల నిర్వహణను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల రాములు గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు గ్యార గోపాల్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గ్యార యాదగిరి, బీజేపీ మండల అధ్యక్షులు పాత్లావత్ రాజేందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి చాపల వెంకన్న, మండల కార్యదర్శి కుక్కల వెంకటేష్,గ్రామస్తులు గ్యార హరికృష్ణ, పల్లె వరుణ్, యాచారం లక్ష్మయ్య, గ్యార యాదగిరి, గ్యార మహేష్, పల్లె చరణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


