నూర్బాషా–దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 

నూర్బాషా–దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 

విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణలో అత్యంత వెనుకబడిన కులాల్లో ఒకటైన నూర్బాషా–దూదేకుల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ నూర్బాషా–దూదేకుల బీసీ ముస్లిం జేఏసీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుడు అహ్మద్ పాష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దూదేకుల కులానికి విద్య, ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి, ప్రాతినిధ్యం లభించలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 15 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ వర్గానికి ఇప్పటివరకు ప్రత్యేక కార్పొరేషన్ లేకపోవడం బాధాకరమన్నారు. చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. దూదేకుల కులస్తుల సంప్రదాయ వృత్తి దూదిని సేకరించి, విత్తనాలను వేరు చేసి, దూదితో పరుపులు, దిండ్లు తయారు చేసి విక్రయించడమని అహ్మద్ పాష తెలిపారు. అయితే ఆధునిక పరిశ్రమలు, ముఖ్యంగా కాయర్ పరిశ్రమల విస్తరణతో సంప్రదాయ వృత్తి దెబ్బతిని జీవనోపాధి కోల్పోయారని అన్నారు. దీంతో అనేక కుటుంబాలు బ్యాండ్ మేళం, టైలరింగ్, సోడాల విక్రయం, పంచర్ షాపులు తదితర చిన్నచిన్న వృత్తులపై ఆధారపడుతున్నాయని వివరించారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే విద్యావంతులైన నిరుద్యోగ యువతతో పాటు మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ, రుణాలు, ఆర్థిక సహాయం అందించి గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లు ప్రకటించినప్పటికీ, అత్యంత వెనుకబడిన దూదేకుల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దూదేకుల వర్గానికి విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని అహ్మద్ పాష కోరారు. ఈ వర్గంలో అధిక శాతం కుటుంబాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందినవేనని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దూదేకుల కులస్తులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో దూదేకుల ఆత్మగౌరవ భవనం నిర్మించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నూర్బాషా–దూదేకుల వర్గం సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బడ్జెట్ కేటాయింపులు చేయాలని అహ్మద్ పాష విజ్ఞప్తి చేశారు.

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ