మట్టి గణపతినీ పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
నిజామాబాద్ : లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా ఆధ్వర్యంలో నగరంలోని బాపూజీ వచనాలయంలో శనివారం మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపూజీ వచనాలయ చైర్మన్ భక్తవత్సలం వినాయక ప్రతిమలను పలువురికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి గణపతులను పూజించాలని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేయడం హర్షనీయమని అన్నారు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా లైన్స్ క్లబ్ ఆఫ్ సహారా ఆధ్వర్యంలో మట్టి గణపతి లను అందించడం జరుగుతుందని కార్యక్రమా చైర్మన్ లయన్ సూర్య భగవాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి మీసాల సుధాకర్ డైరెక్టర్లు ప్రతాప్ లక్కంరెడ్డి గ్రంథాలయ సిబ్బంది, లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా కార్యదర్శి లయన్ ధనుంజయ రెడ్డి, వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


