రిమ్స్ ఆసుపత్రి వద్ద చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 

రిమ్స్ ఆసుపత్రి వద్ద చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 

ఆదిలాబాద్ బ్యూరో :వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ ఆసుపత్రి వద్ద వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర, ఆమె చేసిన పోరాటాలు, సమాజం కోసం అందించిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఇలమ్మ ధైర్యం, పట్టుదల, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. ఆమె స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, బిసి, ఇతర సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు,

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ