ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

గంభీరావుపేట:  మండల కేంద్రంలోశనివారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ నరస గౌడ్, తో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగాపలువురునాయకులుమాట్లాడుతూ.. భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు నేటి తరానికిస్ఫూర్తిదాయకమన్నారు. మహిళా శక్తికి, సామాజిక న్యాయ పోరాటానికి ఆమె ప్రతీకగా నిలిచారన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మను స్మరించుకోవడంతో పాటు ఆమె ఆశయాలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆమె సేవలు, త్యాగాలను ప్రభుత్వం గౌరవంగా స్మరిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాపగారి వెంకటస్వామి గౌడ్ , గోపయ్య  లక్ష్మీనారాయణ గౌడ్, మల్యాల రాజ్వీర్, శివంది శ్రీనివాస్, దిశెట్టి రాజశేఖర్, ఎర్రం అంజిరెడ్డి, మౌలాల రామచంద్రన్ గౌడ్, తోపాటు ప్రజాప్రతినిధులు,రజక సంఘం అధ్యక్షుడు బాలభూది, ఉపాధ్యక్షుడు డి.టి. నరసింహులు, కోశాధికారి కర్రోల రమేష్, సలహాదారు పెద్ద మైసన్న  అశోక్ పాల్గొన్నారు. సంఘ సభ్యులు నారాయణ, అశోక్, పెద్ద మైసన్నగారి ప్రవీణ్, చిన్న కర్రోల సామి, గూడెపు రవి తదితరులు హాజరయ్యారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ