చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

న్యాల్కల్ మండలం, హద్నూర్: వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు. గ్రామస్తులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ న్యాల్కల్ మండల అధ్యక్షులు మల్లేష్ గంగ్వార్ మోడీ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గొప్ప వీరనారి అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. చాకలి ఐలమ్మలోని ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆమె త్యాగాలను కేవలం జయంతి సందర్భంగా మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ నిరంతరం స్మరించుకోవాలని అన్నారు. ఐలమ్మ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అనంతరం గ్రామస్తులు చాకలి ఐలమ్మ సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 32

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ