బిజినపల్లిలో గణనాథుడి లడ్డూకు రూ.1.10 లక్షలు - రికార్డు స్థాయిలో వేలం
- బీసీ కాలనీ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జనం
- జిల్లా నాగర్ కర్నూల్ మండలం బిజినపల్లి
నాగర్ కర్నూల్ : బిజినపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడి లడ్డూ వేలం పాట రికార్డు స్థాయిలో జరిగింది.గురువారం రాత్రి నిర్వహించిన వేలంలో గణనాథుడి లడ్డూను రూ.1.10 లక్షలకు యూత్ కమిటీ సభ్యులే దక్కించుకున్నారు. ఈ ఏడాది లడ్డూ వేలంలో ఇదే అత్యధిక ధరగా నిలిచింది.వేలంలో విజేతలుగా కార్తీక్, మహమ్మద్ రిజ్వాన్, వరుణ్ తదితరులు నిలిచారు. లడ్డూను దక్కించుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం డీజే మేళాల నడుమ భక్తులు గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


