ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నివాళులు అర్పించిన కంది శ్రీనివాస్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆదిలాబాద్ బ్యూరో : దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆ యోధురాలికి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. సామాజిక వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, అణగారిన ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా, తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ అసెంబ్ల్ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, రజక సంఘం అధ్యక్షులు, జక్కుల కార్తిక్,మైలారం శ్రీనివాస్, మైలారం రాము,మాజీ కౌన్సిలర్ భరత్, పలువురు నాయకులు,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం పేద కుటుంబానికి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య తల్లి ఎంకమ్మ...
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 
ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు
చాకలి వీరనారి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం తీసుకోవాలి 
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం :ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం  ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
పోలీస్ శాఖ ఆద్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహాణ