ఆదర్శనగర్ కాలనీ అధ్యక్షుడిగా ఆత్మకూరి కుమార్ యాదవ్
కాటారం (భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీ అధ్యక్షుడిగా ఆత్మకూరి కుమార్ యాదవ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బండం బాపిరెడ్డి, సంతోషం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య సలహాదారుగా పంతకాని సమ్మయ్య, గౌరవ సలహాదారులుగా గద్దె రాంరెడ్డి, చీనాల శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారులుగా గంట రాజబాపు, దుంపల నవీన్, సెక్రటరీలుగా ఐత ప్రభాకర్‌రెడ్డి, పెనుగొండ బాపు ఎన్నికయ్యారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా దుంపల వెంకటరాజం, డాక్టర్ సుంకు రమేష్, పోటు తిరుపతిరెడ్డి, ఎడ్ల సతీష్‌లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా మడక లచ్చిరెడ్డి, సోనపల్లి లక్ష్మారెడ్డి, చీర్ల ఎల్లారెడ్డి, బొమ్మ మనోహర్‌రెడ్డి, ముస్కులా సురేందర్‌రెడ్డి, హాట్కార్ రమేష్, నాగునూరి రవి, పెండ్యాల శ్రీనివాస్, సింగిరెడ్డి మధుకర్‌రెడ్డి, ఉమ్మగాని రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనను రెండోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ వాసుల సహకారంతో కాలనీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. గతంలో అధ్యక్షుడిగా, కన్వీనర్‌గా పనిచేసిన సమయంలో పంతకాని సమ్మయ్య సహకారంతో కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు వేయించినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ పంతకాని సమ్మయ్య, కాలనీ వాసుల సహకారంతో ఆదర్శనగర్‌ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
అనంతరం కాలనీ వాసులు కుమార్ యాదవ్‌ను శాలువాతో సన్మానించి అభినందించగా, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మహిళా అధ్యక్షురాలు ముస్కుల శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


