జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పరిశీలించిన : మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

WhatsApp Image 2026-01-20 at 12.55.00 PM

 

జోగులాంబ గద్వాల : గద్వాల మండల పరిధిలోని కొత్తపల్లి నుండి ఆత్మకూరు వైపుగా వెళ్లే జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి కి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. మంత్రి, ఎమ్మెల్యే  జూరాల ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించడం జరిగినది.జూరాల ప్రాజెక్ట్  హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లాడటం త్వరగా పనులను పూర్తిచేసి ప్రజల్లోకి అందుబాటులో తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ
  గత సంవత్సరం రాష్ట్ర  నీటిపారుదల శాఖ మంత్రివర్యులు జూరాల ప్రాజెక్టు సందర్శన పరిశీలనకు వచ్చిన సందర్భంలో ప్రాంతం ప్రజలు  గద్వాలకు ఆత్మకూరు అనుసంధానంగా జూరాల హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. వెంటనే మంత్రి  దీని ఆమోదం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాంతాలకు మధ్య అనుసంధానం ఉండడంవల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ దానివల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతూనే చెప్పిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రివర్యులు 121 కోట్లు రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వెంటనే సీఎం  శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం చాలా సంతోషం అని హర్షం వ్యక్తం చేశారు. ఆత్మకూరు నుండి గద్వాలకు వెళ్లాలనుకుంటే పదినిమిషాల్లో గద్వాల్ లో చేరుకుంటారు అదేవిధంగా గద్వాల నుండి హైదరాబాదు వెళ్లే వారికి 35 కిలోమీటర్ వరకు రవాణా సౌకర్యం తగ్గుతుంది అని తెలిపారు.బ్రిడ్జి నిర్మాణం తరుణంలోనే ఫోర్ లైన్ ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేయాలని ఆలోచించడం జరిగింది. ఈ ఫోర్ లైన్ నిర్మాణం చేయడం వల్ల గద్వాల నుండి ఆత్మకూర్ మక్తల్ , మంత్రాలయం, బళ్లారి వరకు వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కావడం వల్ల మేమున్న లేకపోయినా మా హయాములో బ్రిడ్జి నిర్మాణం కావడం జరిగిందని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అని పేర్కొన్నారు.ప్రాజెక్టు లో నీళ్లు నిలువ ఉంచడానికి చెక్ డాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి నెమలి చెరువు నామకరణం చేయడం జరుగుతుందని తెలిపారు.జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఉమ్మడి పాలమూరు జిల్లా తోపాటు తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ఈ గద్వాల ఆత్మకూర్ ప్రాంతం మన సౌకర్యంతో పెరగడం వల్ల వ్యాపారంలో కూడా పెరుగుతాయి రైతులు కూడా అభివృద్ధి చెందుతారు దీని వల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందిన తో పాటు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం కొత్తపల్లి మహేశ్వర్ రెడ్డి నివాసంలో మంత్రి, ఎమ్మెల్యే టిఫిన్ చేసి తేనెటీ విందును స్వీకరించారు.
ఈ సందర్భంగా మా ప్రాంత ప్రజలను తరఫున సీఎం కి, ఆర్థికశాఖ మంత్రివర్యులు కి, నీటి పారుదల శాఖ మంత్రివర్యులు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే  మాట్లాడుతూ
గద్వాల ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే గద్వాల కు అనుసంధానంగా ఆత్మకూరు మక్తల్ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఈ రెండు ప్రాంతాలకు అనుసంధాలు ఉన్నప్పుడే మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మా ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున ఉండడం వల్ల ఆ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లి ఈ జూరాల ప్రాజెక్ట్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల ఈ రెండు ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు ఏ విధంగా అనుసంధానం ఉంటుందా వల్ల ఆ ప్రాంతాలు ఏ విధంగా భవిష్యత్తులో మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు.గతంలో జూరాల ప్రాజెక్టు సందర్శన వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ నిర్మాణం పనుల్లో భాగంగా ఫోర్ లైన్స్ రోడ్డు అనుసంధాన తో ఏర్పాటు చేయడం వల్ల గద్వాల నుండి మంత్రాలయం, మంత్రాలయం నుండి బళ్లారి వరకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ప్రాంతాలకు అనుసంధానం ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాలలోని ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు.వ్యాపార రంగాలు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందడం వల్ల ప్రజలకు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది…

Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News