నాగర్ కర్నూల్ లో బార్లు బంద్.. ప్రభుత్వ నిర్ణయంతో నిర్వాహకుల ఆందోళన

ప్రివిలేజ్ ఫీజు 8% నుంచి 16% కి పెంపు.. ఆర్థిక భారంతో మూసివేత

నాగర్ కర్నూల్ లో బార్లు బంద్.. ప్రభుత్వ నిర్ణయంతో నిర్వాహకుల ఆందోళన

నాగర్ కర్నూల్ :తెలంగాణ ప్రభుత్వం బార్ లైసెన్స్ ల ప్రివిలేజ్ ఫీజును భారీగా పెంచడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో బార్ నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. ఫీజుల పెంపు కారణంగా జిల్లాలో పలు బార్లు మూతపడినట్లు సమాచారం. గతంలో 8 శాతంగా ఉన్న ప్రివిలేజ్ ఫీజును ప్రభుత్వం గరిష్ఠంగా 16 శాతానికి పెంచింది. నూతన విధానం ప్రకారం రూ.30 లక్షల నుంచి రూ.39 లక్షల వరకు 8 శాతం, రూ.39.01 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు 10 శాతం, రూ.44.01 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 12 శాతం, రూ.50.01 లక్షల నుంచి రూ.58 లక్షల వరకు 14 శాతం, రూ.58.01 లక్షలు దాటితే 16 శాతం ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.దీంతో బార్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేక బార్ యాజమాన్యాలు మూసివేత బాట పట్టినట్లు తెలుస్తోంది.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!