పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
*14 మంది పేకాట రాయుళ్ల అరెస్టు* *రూ.2,24,100 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం* *పేకాటకు స్థలం కల్పించిన జిన్నింగ్ యజమానిపై కేసు నమోదు* *అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం – ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే
ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 21 )విజన్ ఆంధ్ర)అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే హెచ్చరించారు.విశ్వసనీయ సమాచారం మేరకు గత రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని పాడుబడ్డ మిట్టల్ జిన్నింగ్ ప్రాంగణంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఆదిలాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,24,100 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్పీ తెలిపారు. నిందితులను విచారించగా, స్థల యజమానికి తెలిసే అక్కడ పేకాట ఆడినట్లు వెల్లడించడంతో సదరు యజమాని *గోరేసేట్* పై సైతం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.పేకాట ఆడుతూ పట్టుబడిన 14 మంది నిందితుల వివరాలు:
1. తెహెరె గణేష్ (32) S/o సీతారాం, నివాసం: ఇంద్రవెల్లి గ్రామం, మండలం.2. జాదవ్ దత్త (29) S/o లక్ష్మణ్, నివాసం: హనుమాన్ గల్లి, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.3. జాదవ్ సతీష్ (35) S/o మిహినాథ్, నివాసం: జామిని గ్రామం, జైనూర్ మండలం.4. కేంద్రే సందీప్ (40) S/o రామారావు, నివాసం: జామిని గ్రామం, జైనూర్ మండలం.5. ముప్పవరపు వంశీ (29) S/o పంచాలయ్య, నివాసం: రాంనగర్, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.6. కాగ్నే గైనినాథ్ (29) S/o విఠల్, నివాసం: ఇంద్రవెల్లి గ్రామం, మండలం.7. సూర్యవంశీ తథాగత్ (26) S/o గంగాధర్, నివాసం: సత్వాజిగూడ గ్రామం, ఇంద్రవెల్లి మండలం.8. చింతవార్ సందీప్ (38) S/o హనుమాండ్లు, నివాసం: ఇంద్రవెల్లి గ్రామం, మండలం.9. ఫడ్ విశాల్ (24) S/o ప్రహ్లాద్, నివాసం: సాయినగర్, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.10. పాండే సంతోష్ (29) S/o మాధవరావు, నివాసం: బజార్ గల్లి, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.11. ఫడ్ విజయ్ (27) S/o ప్రకాష్, నివాసం: బజార్ గల్లి, ఇంద్రవెల్లి గ్రామం, మండలం.12. డగ్గే సుధాకర్ (30) S/o నారాయణ్, నివాసం: అంజీ గ్రామం, ఇంద్రవెల్లి మండలం.13. నాన్లన్వార్ హృదయ్ (23) S/o చైత్రనాని, నివాసం: సాలేవాడ (బి) గ్రామం, ఉట్నూర్ మండలం.14. గైక్వాడ్ నారాయణరావు (49) S/o నర్సింగరావు, నివాసం: ఇంద్రవెల్లి గ్రామం, మండలం.అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయండి అనే విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, గంజాయి, అక్రమ కార్యకలాపాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని ఎఎస్పీ సూచించారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేరుగా పర్యవేక్షించే వాట్సాప్ నంబర్ 8712659973 కు సమాచారం పంపవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు వాటికి సహకరించే వారిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


