రాష్ట్ర అభివృద్ధికి టీజీఎస్‌పీఎఫ్‌ రక్షణ కవచం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అమీన్‌పూర్‌లో తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి: భద్రతే అభివృద్ధికి బలమైన పునాది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించిన తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (TGSPF) ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కీలక సంస్థలకు పటిష్టమైన భద్రత కల్పిస్తూ టీజీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. రాష్ట్ర అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే కీలక ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయాలకు భద్రత ఎంతో అవసరమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సహా రాష్ట్రంలోని 67 కీలక సంస్థలకు టీజీఎస్‌పీఎఫ్‌ రక్షణ కల్పిస్తోందని వెల్లడించారు. దాదాపు రెండు వేల మంది సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రగతికి రక్షణ కవచంలా నిలుస్తున్నారని ప్రశంసించారు.ఆధునిక సాంకేతికతపై శిక్షణ అవసరంప్రస్తుతం భద్రతా రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. డ్రోన్లు, కృత్రిమ మేధ (AI) వంటి సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భద్రతా సిబ్బందికి నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అవసరమని పేర్కొన్నారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా సిబ్బంది తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందిప్రజలకు భరోసా కల్పిస్తూ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న టీజీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కీలక సంస్థల రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు.రేయింబవళ్లు శ్రమిస్తూ రాష్ట్ర భద్రతతో పాటు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న టీజీఎస్‌పీఎఫ్‌ అధికారులు, సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో సిబ్బందికి అండగా నిలుస్తున్న వారి కుటుంబ సభ్యులను కూడా అభినందించారు. రాష్ట్ర భద్రతలో టీజీఎస్‌పీఎఫ్‌ తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!