మన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు.

సంతోషం వ్యక్తపరిచిన లబ్ధిదారులు.....

మన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు.

బాన్సువాడ  : . బాన్సువాడ నియోజకవర్గం లో మన ఇందిరమ్మ ఇళ్లలో సోమవారం దీపావళి సంబరాలు లో పాల్గొన్న పోచారం. లబ్ధిదారుల కుటుంబాల తో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ నియోజకవర్గం వివిధ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యుల తో దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొని, వారితో ఆత్మీయం గా ముచ్చటించి పండుగ ఆనందాన్ని పంచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి. ఈ సందర్భం గా బాన్సువాడ మున్సిపాలిటీ – 2వ వార్డు, బీడీ వర్కర్స్ కాలనీ జట్ల జ్యోతి – రాజు, చిలివేరి స్వప్న – ప్రవీణ్ కోటగల్లి సంగీత – రవికుమార్ బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామం పెంట లలిత – సుదర్శన్, జంగిలి పార్వతి – మోగులయ్య నస్రుల్లాబాద్ మండలం – మీర్జాపూర్ గ్రామం పురం అమృత – శ్రీనివాస, పురం సవిత – రమేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన కుటుంబాల ఇళ్లకు వెళ్లి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇల్లు ప్రతి కుటుంబానికి ఒక కల..... ఆ కలను నిజం చేసిన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నింపుతూ ప్రజలతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ దీపావళి వేడుకల లో బాన్సువాడ పట్టణ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Views: 49

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్