యువతి మిస్సింగ్ కేసు నమోదు

యువతి మిస్సింగ్ కేసు నమోదు

బిజినపల్లి (నాగర్ కర్నూల్) : బిజినపల్లి మండలానికి చెందిన 18 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది.మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి నాగర్ కర్నూల్ లోని ఓ బట్టల షాప్ లో గత ఏడాది కాలంగా పని చేస్తోంది. ఈ నెల 08వ తేదీ ఉదయం 10 గంటలకు ఎప్పటిలాగే పనికి వెళ్లింది. రాత్రి 8 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా, రాత్రి 9 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో బట్టల షాప్ నిర్వాహకుడికి ఫోన్ చేసి ఆరా తీయగా, ఆమె షాప్ కు రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లోని బంధువుల ఇళ్లలో, తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.దీంతో మరుసటి రోజు అంటే 09/11/2026 న ఉదయం 10:30 గంటలకు బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.యువతిని ఎవరైనా తీసుకెళ్లారా అని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.యువతి ఆచూకీ తెలిస్తే బిజినపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ శంషుద్దీన్ కోరారు.


Views: 224

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్