ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

నేర నియంత్రణపై ప్రత్యేక నిఘా.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ మహేష్ బి. గితే

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ఇల్లంతకుంట (రాజన్న సిరిసిల్ల జిల్లా) :  ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు, సిబ్బంది విధులు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. ఈ సందర్భంగా నేర నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన కేసుల్లో జాప్యం చేయకుండా దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందితో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ తనిఖీలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ఉపేంద్రచారి, లక్పతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 38

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్