తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీలో 9వ వార్షికోత్సవ క్రీడా పోటీలు ప్రారంభం
- క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం - ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో
మల్హర్ : మండల కేంద్రమైన తాడిచెర్ల కోల్ బ్లాక్-1 ఏఎంఆర్ కంపెనీ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న క్రీడా పోటీల ప్రారంభ వేడుకలు సోమవారం ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో యువత మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడకుండా మైదానాల్లో క్రీడలు ఆడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మైదానాల్లో క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఉత్సాహం, ఐకమత్యం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ మేనేజర్ సురేష్ బాబు, జీఎం మెకానికల్ విశ్వప్రసాద్, ఫిట్ ఇంజనీర్ కిషన్, సర్వే జీఎం సర్వోత్తమ్, హెచ్‌ఆర్ డీజీఎం రమేష్ బాబు, కంపెనీ ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


