తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి:

పంట రుణాలను రీ షెడ్యూల్ చేసి వడ్డీ మాఫీ చేయాలి.

తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి:

వరి పంటకు 30,000, పత్తి ఎకరానికి 50,000 నష్ట పరిహారం చెల్లించాలి.

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.

చండూరు,(నల్లగొండ) : ఎల్ నినో కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చండూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రైతులు వేసిన పంటలు ఎండిపోయాయని,గ్రామాలలో సాగునీరు,త్రాగునీరు లేక ఇబ్బందులుఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులపై ఉన్న పంట రుణాలను తక్షణమే రీ షెడ్యూల్ చేయాలని,రుణాలపై వడ్డీని పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నష్టపోయిన రైతులకు ఎకరానికి పత్తి పంటకు రూ.50వేల చొప్పున, వరి పంటకు రూ.30వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 200 రోజులకు పెంచాలని కోరారు.కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవాలని,సాగునీరు లేక ఎడారి ప్రాంతంగా ఉన్న మునుగోడు నియోజకవర్గానికి తాగునీరు అందించే దిండి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటాలు కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య,మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్,పార్టీ జిల్లా సమితి సభ్యులు తిప్పర్తి రాములు, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు,మండల పార్టీ కార్యవర్గ సభ్యులు బరిగల వెంకటేష్,దోటి వెంకన్న,జెల్ల శ్రీను,బండమీది వెంకన్న, సిహెచ్ ఉషయ్య, గంటా రమేష్,ఇరిగి సంజీవ, గడ్డం నవీన్,కస్తాల సర్పంచ్ లేదన్న సత్యం,కురుపాటి పరమేష్,గంట నగేష్,పల్లె శంకరయ్య,శివర్ల లింగస్వామి, చీకటిమూడు యాదయ్య, జోగు రమేష్,జగన్,నరహరి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్