ప్రధాన రహదారిపై డివైడర్లు లేకపోవడం వల్లనే యాక్సిడెంట్లు ?

నేషనల్ హైవే కాంట్రాక్టర్, మంత్రి పొన్నం, కేంద్రమంత్రి బండి సంజయ్ నిర్లక్ష్యం??

ప్రధాన రహదారిపై డివైడర్లు లేకపోవడం వల్లనే యాక్సిడెంట్లు ?

హుస్నాబాద్  : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామ శివారులో జరిగిన ప్రమాదంపై ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ లు లేకపోవడం దారుణమని రోడ్డు వారోత్సవాలు వలన ప్రయోజనాలు ఏమిటని హుస్నాబాద్ బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణం గుండా వెళుతున్న నేషనల్ హైవే పనులలో నిర్లక్ష్యం వల్ల అనేక యాక్సిడెంట్లు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంట్రాక్టర్ ల నిర్లక్ష్యం వల్ల డివైడర్లు ఏర్పాటు చేయకపోవడం ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆరోపించారు.పందిల్ల బ్రిడ్జి వద్ద,దాటిన తర్వాత ఇటీవల కాలంలో ఆరు సంఘటనలు జరిగి పలువురు చనిపోయారని,
వికలాంగులయ్యారన్నారు.విపరీతమైన వేగం పెరిగింది. ఒకవైపు  ఇసుక ట్రాక్టర్ల అతివేగంతో ప్రజల ప్రాణాలు కూడా తోడేస్తున్న పరిస్థితులు ఉన్నాయని,ఈరోజు చిగురుమామిడి మండలం  కొండాపూర్ గ్రామానికి చెందిన తండ్రి, కూతురు చనిపోవడం చాలా బాధాకరమన్నారు.స్పీడ్ లిమిట్ లేకపోవడం ఒక కారణంగా మారుతుందని,రోడ్డు వారోత్సవాలు చేస్తున్న ఇవేమీ యాక్సిడెంట్లు  అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.అదే విధంగా ఈరోజు యాక్సిడెంట్ చేసిన ట్రాక్టర్ కి కూడా ఇన్సూరెన్స్ లేనట్లు తెలుస్తుందన్నారు.గత నెల రోజుల క్రితం మున్సిపల్ పట్టణంలో జరిగిన మున్సిపల్ ట్రాక్టర్ ఢీకొని చనిపోయిన సంఘటనలో మున్సిపల్ ట్రాక్టర్ కి కూడా ఇన్సూరెన్స్ లేనట్లు తెలుస్తుందన్నారు.రోడ్లమీద ఇన్సూరెన్స్ లేకుండా ఇష్టరాజ్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్న ఇటువంటి వాహనాల విషయంలో పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకోవాలని బిఎస్పి పార్టీ పక్షాన కోరారు.

Views: 76

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్