ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహిస్తూ సర్పంచ్ గీతారాణి రమేష్ అభినందనీయ నిర్ణయం
చౌటకూర్ :- మండలం సుల్తానూర్ గ్రామంలో ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించేందుకు గ్రామ సర్పంచ్ గీతారాణి రమేష్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో ఆడపిల్ల జన్మించిన కుటుంబానికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకాన్ని మంగళవారం అందజేశారు. ఆడపిల్లల పట్ల సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలిచిన సర్పంచ్ గీతారాణి రమేష్‌ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


