సిద్దిపేటలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.
చేర్యాల : సిద్దిపేట జిల్లా కేంద్రంలో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, ప్రజల రాకపోకలు, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించి, సభకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ నెల 19న నిర్వహించనున్న ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్తగా మంజూరైన వృద్ధాప్య పింఛన్ల పంపిణీతో పాటు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గురించి వివరించనున్నారు .ఈకార్యక్రమంలో చేర్యాల ఏఎంసి చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు మహాదేవుని శ్రీనివాస్, చేర్యాల మండల అధ్యక్షుడు మంజ మల్లేశం, చేర్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, ధూలిమిట్ట మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌తో, మద్దూర్ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ బోయిన్ శ్రీనివాస్ తో పాటు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగం రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చెరుకు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


