విద్యుత్ షాక్‌తో రైతు మృతి.. రంగాయపల్లిలో విషాదం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందడం విషాదాన్ని నింపింది. వ్యవసాయ పొలంలో బోరు మోటారు ఆన్ చేసేందుకు స్టార్టర్ వద్దకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగాయపల్లికి చెందిన రాజబోయిన లక్ష్మణ్ (42) మంగళవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు.ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతూ తిరిగి వస్తుండటంతో బోరు మోటారును ఆన్ చేసేందుకు స్టార్టర్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన వారు వెంటనే లక్ష్మణ్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రైతు మృతితో రంగాయపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


