మాసం సొసైటీ సేవలకు సలాం
మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ కి సేవా రత్న అవార్డు
అడిషనల్ కలెక్టర్ మరియు అశోక్ సామ్రాట్ చేతుల మీదుగా అందజేత
ఆదిలాబాద్ డెస్క్, : బోథ్ మండల కేంద్రం కి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కి సేవా రత్న అవార్డు లభించింది సోమవారం ఆదిలాబాద్ జిల్లా లోని రాయి గూడ గ్రామం లో సామ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆదివాసీ దండారి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ మరియు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముస్తాపరె అశోక్ హాజరు అయ్యారు అలాగే ఈ దండారీ కార్యక్రమం లో సుమారు 36 గ్రామాల ఆదివాసీ బృందాలు పాల్గొన్నాయి ఈ కార్యక్రమం లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా లో సమాజం కి మరియు ప్రజలు కి విశిష్ట సేవలు అందిస్తున్న మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కి అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డు అందించడం జరిగింది అని అశోక్ తెలిపారు భవిషత్తు లో మరిన్ని సేవలు చేయాలి అని ఎల్లపుడు అండగా ఉంటాం అని తెలిపారు ఈ అవార్డు ను మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ మరియు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముస్తా పరె అశోక్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెందూర్ లక్ష్మణ్ ,ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలదేవి బాయి, ఐటీడీఏ ATO ఆత్రం భాస్కర్ మరియు తదితర ప్రముఖులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


