24న కన్నాల బుగ్గ ఆలయంలో జ్వాలాతోరణం
ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఆహ్వాన పత్రిక అందజేత బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 24న మంగళవారం నూతనంగా జ్వాలాతోరణం మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో సాయంత్రం ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ దేవస్థాన ఈఓ, ఆలయ అర్చకులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలు, ఉత్సవ ఏర్పాట్లను వివరించారు. కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా నిర్వహించే జ్వాలాతోరణం మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆలయ అధికారులు, అర్చకులు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


