ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ముందుకు వెళ్లాలి
వరి సాగు చేయవద్దు ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పు ధాన్యాలు వేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పలువురు ఉత్తమ రైతులకు సన్మానం
గంభీరావుపేట, : ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.గంభీరావుపేట మండలం రాజేశ్వర్ రావు నగర్ లో కేతు బచావో అభియాన్ ఎల్ నినో ప్రభావం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇటీవల ఆయిల్ పామ్ మొక్కలు నాటిన పలువురు రైతులను సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సూపర్ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు. వరి సాగు చేస్తే నీరు భారీగా అవసరమని వెల్లడించారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పొడి ఎండ వాతావరణంతో రాను రాను రాను భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని వివరించారు. గంభీరావుపేట మండలంలో గత ఏడాది భూగర్భ జలాలు 5.96 మీటర్ల లోతులో ఉండేవని, ఈ ఏడాది 8.39 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయని తెలిపారు. దీంతో గత నెలలో విద్యుత్ వినియోగం 25 శాతం పెరిగిందని వెల్లడించారు. రైతులు మంచి ఆదాయం వచ్చే.. నీటిని తక్కువగా వినియోగించే పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ కు టన్ను ధర ప్రస్తుతం 22 వేల 658 ఉందని వెల్లడించారు. అలాగే జిల్లాకు దగ్గర్లోనే సిద్దిపేటలో జిల్లాలో ఆయిల్ ప్లాన్ ఫ్యాక్టరీ ఉందని వివరించారు. పంటల మార్పిడితో నేలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇల్లు, వ్యవసాయ క్షేత్రాల వద్ద నీటి, విద్యుత్ వృథాను అరికట్టాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ జలసిరి పనులు వీబీజీరామ్ జీ కింద జిల్లాలో తెలంగాణ జలసిరి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పామ్ పాండ్ లు నిర్మించుకోవాలని పేర్కొన్నారు. దీంతో భూగర్భ జలాలు వృద్ది చెందుతాయని, పంటల సాగుకు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రస్తుత సూపర్ ఎల్ నినో ప్రభావంతో రైతులు నువ్వులు, వేరుశనగ, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ ఫామ్ చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ పిట్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


