కొలంగూడా లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు –

వాఘపూర్‌లో ఇంటింటా ఇందిరమ్మ దీపావళి సంబరాలు! ఏఎంసీ చైర్మన్ బోరంచు

కొలంగూడా లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు –

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని కొలం గూడా గ్రామంలో ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారికి గ్రామస్తులు ఘనంగా ఆహ్వానం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కులం గూడా గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తుల సమక్షంలో ఉత్సాహంగా నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వాఘపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఇందిరమ్మ దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పండుగ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమాల్లో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుదురుపాక సురేష్ కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకూరి శేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, వినోద్, అశోక్, శంకర్, రవి, లవన్, మార్సకోల గౌతమ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి ఉంటూ వారి సంతోషాల్లో భాగస్వామి అవుతుందని తెలిపారు. ప్రజలతో మమేకమై… పండుగల్లో భాగస్వాములై… అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది.


Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్