కోహెడ మండలంలో నూతన ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో దీపావళి వేడుకల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారు పార్నంది.శంకరవ్వకి నూతన బట్టలు పెట్టీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా నూతన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో క్రాకర్స్ కాల్చి బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ జీవన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల జయరాజ్,వివిధ గ్రామాల సర్పంచ్ లు ,ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ ఇళ్లు పేరు తో పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తున్నామన్నారు.అర్హత ఉన్న చాలా మంది ఉన్నప్పటికీ మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పుడు 2000 ఇళ్లు మంజూరు అయ్యాయని,లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పేద వారికి అర్హత ఉన్న వారికి అందిస్తున్నామన్నారు.గత 10 ఏళ్లలో ఇల్లు ఇవ్వకపోవడం వల్లే అర్హత కలిగిన వారి సంఖ్య పెరిగి పోయింది.ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోవడం జరిగిందన్నారు.
అర్హత లేకుండా ఇళ్లు ఇవ్వడానికి లేదు పెదలల్లొ పేదలకు ఇల్లు ఇస్తాం.
హుస్నాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు చాలా పారదర్శకంగా జరిగాయని, ఇటీవల వింజపల్లి గ్రామానికి అవార్డు పొందిన సర్పంచ్ శుభాకాంక్షలు తెలిపారు.గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం గ్రామం నుండి భూమి ఇచ్చిన వారికి ధన్యవాదాలు,గౌరవెల్లి ప్రాజెక్ట్ తో సస్య శ్యామలం చేస్తామన్నారు.మొదటి దశలో మంజరైన 3500 ఇందిరమ్మ ఇల్ల లో ఇప్పటికే 2500 పైగా ఇళ్లు పూర్తయ్యాయని త్వరలో రెండో దశ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు.పెండింగ్ లో ఉన్న ఇల్లు కూడా వేగంగా నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


