వృద్ధాశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు
వృద్ధులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్న నిర్వాహకులు కల్వకుర్తి, : కల్వకుర్తి పట్టణంలోని వృద్ధాశ్రమంలో ఆదివారం దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు పెరుమాళ్ల వెంకటయ్య, కోఆర్డినేటర్ బి. పద్మ ఆధ్వర్యంలో వృద్ధులు, సిబ్బంది కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు టపాసులు పేల్చి, సురబాణాలు కాల్చుతూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. అనంతరం వృద్ధాశ్రమ నిర్వాహకులు వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వృద్ధులతో కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


