ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన.

•అంజన్న గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం. •200 మందికి నేత్ర పరీక్షలు. •35 మందికి శస్త్రచికిత్స.

ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన.

కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి ప్రోత్సాహంతో కోదాడ 30 వ వార్డు కౌన్సిలర్ కారింగుల ఉమ అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైంది. శంకర కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ శిబిరంలో మొత్తం 200 మంది పాల్గొని నేత్ర వైద్య పరీక్షలు చేయించుకున్నారు.వైద్య పరీక్షల అనంతరం 35 మందికి కంటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన వైద్యులు,వారికి చికిత్స చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమం పలువురికి ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన కౌన్సిలర్ కారింగుల అంజన్ గౌడ్ కృషిని పలువురు అభినందించారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని స్థానికులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చలిగంటి ప్రసాద్,పంది తిరపయ్య ఎన్సిహెచ్ రాము,రాపోలు శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్,వంగవీటి శేఖర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మిట్టకోలు కమలాకర్,చలిగంటి రంగా, తంగెళ్ళపల్లి లక్ష్మణ్, మల్లయ్య, స్టాలిన్,నర్సి, శివ, శేషు,నజీర్, రవి తదితరులు పాల్గొన్నారు

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్