ఆదిలాబాద్‌లో నూతన ఐటీ టవర్ ప్రారంభోత్సవము.... డి సి సి అధ్యక్షుడు నరేశ్ జాదవ్, అసెంబ్లీ ఇంచార్జి కంది
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు 11న మధ్యాహ్నం 12:30 నిముషాలకు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ఐటీ టవర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ఐటీ టవర్ అందుబాటులోకి రావడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. జిల్లా అభివృద్ధిలో ఇది మరో కీలక ముందడుగుగా నిలవనుంది. కావున జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నాయకులను,కార్యకర్తలను కోరారు

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


