గుస్సాడీ-దండారి ఉత్సవాలకు హాజరైన ఉట్నూర్ ఐటీడీఏ పిఓ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్
ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న గుస్సాడీ-దండారి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా గుస్సాడీ వేషధారణలో ఉన్న ఆదివాసులతో కలిసి ఉట్నూర్ ఐటీడీఏ పి ఓ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ పలువురు ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొని . గిరిజన ఆదివాసి ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు మర్సుకుల తిరుపతి,ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ జిఎం జాదవ్ రామ్ కిషన్ నాయక్, ప్రజా సంఘాల జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నేతావత్ రాందాస్ నాయక్,ఐటీడీఏ ఏపీవో భాస్కర్, పవర్ దేవిదాష్, సీడం సోనేరావ్, మత్తడి గూడ గ్రామస్తులు, జైనూర్ మండలంలోని ,మార్లవాయి గ్రామ గుస్సాడి బృందం, గ్రామస్తులు తదితరులు హాజరయ్యారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


