వెంకటకిష్టాపూర్‌లో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు
లబ్ధిదారుల ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
చౌటకూర్ : చౌటకూర్ మండలం వెంకటకిష్టాపూర్ గ్రామంలో ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు మినుపూరి బుజ్జమ్మ, సంజీవులు దంపతుల ఇంట్లో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని పండుగ సంబరాలు జరుపుకున్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించుకున్న ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించడం ద్వారా లబ్ధిదారుల కుటుంబంలో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడపట్ల గణేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అందోల్ శేఖర్, వార్డు సభ్యులు పల్లె భాస్కర్, చాకలి వెంకటేశం, మాజీ సర్పంచ్ స్వరూప శ్రీనివాస్, సారా ప్రకాష్, చిద్రుప్ప పాండు, తలారి శ్రీనివాస్, ఈర్ల శ్రీనివాస్, అశోక్, హరిజన్ కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


