తాడిచెర్లలో విషాదం.. గుండెపోటుతో కార్పాకుల కొమురయ్య మృతి
మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్న సర్పంచ్ బండి స్వామి
మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు కార్పాకుల కొమురక్క కుమారుడు కార్పాకుల కొమురయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులను ఓదార్చి అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కుటుంబానికి అండగా ఉంటారని, ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.అనంతరం మృతదేహంపై కండువా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తిర్రి అశోక్, ఇందారపు సారయ్య, బంధువులు, ముదిరాజ్ కులస్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

