పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని జీవనశైలి వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం లో భాగంగా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు భుజంగరావు అధ్యక్షతన వారి చాంబర్లో నిర్వహించినట్లు పి ఓ డి టి టి వైద్యాధికారినీ డాక్టర్ అంజన మేడం తెలియజేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ భుజంగారావు మాట్లాడుతూ గతంలో జరిగిన సమావేశoలో తీసుకున్న నిర్ణయాలపై, చేపట్టిన చర్యలపై సమీక్షించారు. అక్టోబర్ 28న ప్రారంభమైన టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ లో భాగంగా రెండు నెలల లేదా 8 వారాల కార్యక్రమాన్ని నాలుగు విభాగాలుగా విభజించి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఒకటి,రెండు వారాలు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, ద్వారా కరపత్రాలు పోస్టర్లు వివిధ పద్ధతుల ద్వారా విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. తర్వాతి మూడు నాలుగు వారాలు పాఠశాలలో కళాశాలలో యూనివర్సిటీలు మొదలగు ప్రాంతాల్లో యువతకు విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. 5 6 వారాల్లో టొబాకో ఫ్రీ గ్రామాలుగా మార్చే ప్రయత్నాలు చేయాలన్నారు. చివరి ఏడు ,ఎనిమిది వారాల్లో విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో టొబాకో ఉత్పత్తులను మైనర్లకు అమ్మ రాదని, చట్టం నియమ నిబంధనలు ఉల్లంఘించి విద్యాసంస్థల వద్ద పొగకు ఉత్పత్తులు అమ్మే వాటిపై జరిమానా విధించాలని ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్‌కు సూచించారు. ప్రతి విద్యా సంస్థలో టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రహరీ క్లబ్బుల నిర్మాణం జరగాలన్నారు, గత సమావేశంలో కంటే 20% స్క్వాడ్ రైడింగ్ లను పెంచాలని సూచించారు. కాలేజీలు విద్యాసంస్థల్లో పొగాకు వల్ల కలిగే అనర్ధాలు, ప్రహరీ క్లబ్బుల వివరాలు ప్రదర్శించాలన్నారు. టొబాకో ఫ్రీ జోన్లుగా ప్రకటించాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ స్మోకింగ్ వంటి వాటికి అలవాటు పడకుండా అవగాహన కలిగించాలని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదన్నారు. జిల్లాస్థాయిలో టొబాకో సెల్ ఏర్పాటు చేయాలని, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలో యూనివర్సిటీలో తప్పకుండా అవగాహన కలిగించాలీ అన్నారు. జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వాడకం కు ప్రభావితం అవుతున్న ప్రదేశాలను గుర్తించాలని , అక్కడ ఇంకా ఎక్కువ స్థాయిలో అవగాహన కలిగించాలి అన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సర్క్యులర్ ద్వారా సమాచారాన్ని అందించాలన్నారు. పాఠశాలలో కళాశాలలే ప్రధానo కాబట్టి తదుపరి సమావేశానికి డిఇఓ ను మరియు డిఐఓను హాజరయ్యేలా చూడాలన్నారు. పొగాకు పంటలను వేరే ఇతర పంటలను పండించడం ద్వారా మానుకోవాలన్నారు. పి ఓ డి టి ప్రోగ్రాం అధికారి డాక్టర్ అంజన గారు మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలో కళాశాలలో మరియు యువతకు టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 4.0 రెండు నెలల కాలంలో విస్తృతస్థాయిలో అవగాహన కలిగించే, అన్ని పాఠశాలలో విద్యాశాఖ సహకారంతో ప్రహరీ క్లబ్బులు ఏర్పాటు అయ్యేలా చూస్తామని, పాఠశాల ప్రహరీ నుండి 100 మీటర్ల లోపల పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా షాపు యాజమాన్యాలకు తగిన సూచనలు చేస్తామన్నారు. జిల్లాస్థాయి సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ మాట్లాడుతూ నికోటిన్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న టాబ్లెట్లు, చప్పరించే మాత్రలు, నికోటిన్ ప్లాస్టిక్ స్టిక్కర్స్, మొదలగు వాటిని ఉపయోగించి సిగరెట్ అలవాట్లను మాన్పించవచ్చని, అవసరమైన వారికి జిల్లాస్థాయిలో డి అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నామన్నారు. గత జూన్ మాసం నుండి ఇప్పటివరకు అనేక అవగాహన కార్యక్రమాలను పాఠశాలలో, కళాశాలలో, అనాధ ఆశ్రమాల్లో నిర్వహించామని, అవగాహన ర్యాలీలను కూడా తీసామని అన్నారు. చాలా గ్రామాల్లో 50 నుండి 60% పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన యువత ఉన్నారని, స్మోకింగ్, డ్రింకింగ్ చట్టపరంగా అనుమతులు ఉండడం వల్ల అవగాహన కలిగించడమే అసలైన ఆయుధంగా ఉందన్నారు. మా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్న ఉద్యోగులు, ఇతర వ్యక్తులు నికోటిన్ కు అలవాటు పడుతున్నారని వీరు టాబ్లెట్స్ వాడడం ద్వారా స్మోకింగ్ మానవచ్చు అన్నారు. జిల్లా స్థాయిలోని డి అడిక్షన్ కేంద్రానికి ఎక్కువగా బాల్కొండ, ఆర్మూర్ ,సిరికొండ ప్రాంతాలలో యువత స్మోకింగ్, గంజాయి, మత్తుపదార్థాలకు బానిసై రిఫర్ చేయబడుతున్నారన్నారు. కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకన్న వివరించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అంజన,డాక్టర్ వెంకన్న, జిల్లా సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ, ఎంపీడీవో రామనారాయణ, ఏ ఈ ఓ చక్రపాణి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సవిత, రెడ్ క్రాస్ నెంబర్ బస్సు ఆంజనేయులు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నవీన్, పోలీస్ అధికారి ఎస్ఎం అలీ, వైద్యాధికారి సుధాకర్, సి ఎం ఓ శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కమర్ అహ్మద్, డిహెచ్ఈ గన్ పూర్ వెంకటేశ్వర్లు, ఎన్సిడి కోఆర్డినేటర్ పి వెంకటేశం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


