కక్షసాధింపు చర్యలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెక్‌.. కార్యకర్తలకు సముచిత గుర్తింపు

- అన్యాయంగా సస్పెండ్ చేసిన నేతలకు ప్రతిష్టాత్మక కమిటీల్లో పదవులు - దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు - ఉప సర్పంచ్ లకావత్ సవేందర్

మల్హర్ : రాజకీయ కక్షసాధింపు చర్యలతో తమను అణగదొక్కాలని చూస్తే, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాత్రం కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని గౌరవించారని కొయ్యూరు ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ అన్నారు. రాజకీయంగా తమను ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించినప్పటికీ, ఎంపీ గారు తమకు సముచిత గుర్తింపు కల్పించి కీలక పదవులు అందించడం ఆనందంగా ఉందన్నారు.మంథని నియోజకవర్గ పరిధిలోని మల్హర్ రావు మండలానికి చెందిన నాయకులకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్టాత్మక కమిటీల్లో సభ్యులుగా అవకాశం కల్పించడం పట్ల మండలవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా లకావత్ లక్ష్మికి రైల్వే సలహా మండలి సభ్యురాలిగా, లకావత్ సవేందర్, మహమ్మద్ ఖాలీముద్దీన్, దేవి భూమయ్యలకు టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా పదవులు లభించాయని పేర్కొన్నారు.దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించడమే కాకుండా, కీలక పదవుల్లో అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. తమ వర్గాలకు అండగా నిలుస్తూ రాజకీయంగా ప్రోత్సహిస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తమను గుర్తించి గౌరవించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఆయనకు రాజకీయంగా పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. తమ తాతలు, తండ్రుల కాలం నుంచే స్వర్గీయ కాకా గారి కుటుంబం, మంత్రి వివేక్ గారి అభిమానులుగా కొనసాగుతున్నామని గుర్తుచేశారు.
మా ప్రాంత అభివృద్ధికి, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరుతూ, ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని లకావత్ సవేందర్ సంతోషం వ్యక్తం చేశారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్