హుస్నాబాద్‌లో 28 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్న రాజు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్న రాజు ఆధ్వర్యంలో తహసీల్దార్ లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వెన్నె రాజు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించడమే కళ్యాణలక్ష్మి పథకం లక్ష్యమన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోలు సంపత్, వివిధ గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


