అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మంచంతో సహా పూర్తిగా కాలిపోయిన వ్యక్తి
కంగ్టి, : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన గునే జరప్ప (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.మంచంతో సహా ఆయన శరీరం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం....జరప్ప తన ఇంట్లో మంచంపై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడికి భార్య బుజ్జమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.ఘటనపై సమాచారం అందుకున్న కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి అన్న రఘునాథ్ ఇచ్చిన పిర్యాదు మేరకు అనుమదాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గారెడ్డి తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


