*వడ్డీ వ్యాపారులపై కొరడా ఝులిపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్

జిల్లా వ్యాప్తంగా 13 మండలాలలో 25 బృందాలచే ఆకస్మిక దాడులు.

*వడ్డీ వ్యాపారులపై కొరడా ఝులిపించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్

జిల్లాలో 18 కేసుల నమోదు.

 వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, చెక్కులు, రిజిస్టర్లు, స్థలాల డాక్యుమెంట్స్ స్వాధీనం.

 ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, రూరల్, బోథ్, బేల, ఉట్నూర్, ఇచ్చోడా, నార్నూర్, గుడిహత్నూర్, నేరడిగొండ, జైనథ్ మండలాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు. 

 అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

 లైసెన్సు లేని వడ్డీ వ్యాపారస్తులపై కఠిన చర్యలు. 

ఆదిలాబాద్ బ్యూరో :  అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  కఠినంగా వ్యవహరిస్తూ, జిల్లాలో ఏకకాలంలో 13 మండలాలలో 25 బృందాలచే ఆకస్మిక దాడి నిర్వహించడం జరిగింది. ప్రజల వద్ద వడ్డీ పేరుతో వారి నడ్డి విరుస్తూ ప్రజల రక్తాన్ని పిండి పీలుస్తున్న అక్రమ వ్యాపారస్తుల గుండెల్లో ప్రశాంతత లేకుండా జిల్లా ప్రజలకు న్యాయం చేసే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ వ్యాపారాలు నిర్వహించకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తూ వారి ఆటలను కట్టడి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఆసాంఘిక కార్యకలాపాలను రూపుమాపడమే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రధమ లక్ష్యం. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఏకకాలంలో 13 మండలాలలో 25 బృందాలచే దాడులు నిర్వహించగా 18 కేసుల నమోదు అయినట్లు వివరించారు. వడ్డీ వ్యాపారుల వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు, రిజిస్టార్లు, స్థలాల ఇళ్ళ డాక్యుమెంట్లు, వంటి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రజల అవసరాలకు అధిక వడ్డీలను వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
🔹 ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు.
🔹 ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసు నమోదు.
🔹 మావల పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు  నమోదు.
🔹 ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసులు నమోదు. 
🔹 జైనథ్ పోలీస్ స్టేషన్ నందు ఒక కేసు నమోదు. 
🔹 బేల పోలీస్ స్టేషన్ నందు ఒక కేసు నమోదు. 
🔹 బోథ్ పోలీస్ స్టేషన్ నందు ఒక కేసు నమోదు. 
🔹 ఉట్నూర్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు నమోదు. 
🔹 గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు ఒక కేసు నమోదు. 
🔹 నార్నూర్ పోలీస్ స్టేషన్ నందు 1 కేసు నమోదు. 
🔹 నేరడిగొండ పోలీస్ స్టేషన్ నందు 1 కేసు నమోదు. 
కేసులు నమోదు అయిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో సెక్షన్ 3 (5)(b) తెలంగాణ ఏరియా మనీ లెండర్స్ ఆక్ట్ 1349 కింద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 
 వారి వివరాలు
 ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 
1. ఎస్ కే సాజిద్ @ సాజిత్ గౌడ్ s/o అక్బర్ 
2. ఎర్రోజు కేశవ్ s/o ఎర్రోజు రమణయ్య, బంగారు షాప్ యజమాని.
3. ఓరగంటి రఘు, కొలిపుర.
 ఆదిలాబాద్ టు టౌన్ పరిధిలో
1. టాపిక్ అహ్మద్ @ జన్ను.
2. షేక్ అక్బర్ s/o షేక్ సద్దాం
 మావల పోలీస్ స్టేషన్ పరిధిలో
1. దుర్గా శేఖర్ రెడ్డి 
2. దాసరి నరోత్తం 
3. చిట్టి రాజేశ్వర్ 
4. షేక్ ఆసిఫ్,
 రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు. 
1. అజయ్ కుమార్ గాడ్సే, రాంపూర్.
 జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో
1. ఆత్మకూరు అమరేందర్ s/o నారాయణ.
 బేల పోలీస్ స్టేషన్ పరిధిలో
1. కార్తీక్
 బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో
1. ఈ రమేష్, సాయి నగర్, బోథ్.
 ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో
1. సాయి రెడ్డి, దంతనపల్లి.
2. ఇప్ప సంతోష్.

 నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో
1. కలాలి వెంకటరమణ, వడూర్. 
 నార్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో
1. అరే అశ్విని, 
 గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో
1. కేంద్రీ రాహుల్, మన్నూరు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్