కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ

కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ

చేగుంట  :  చేగుంట మండలం కరణంపల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ జరిగింది. కరణంపల్లి ఎల్లమ్మ దేవాలయం దగ్గర చిన్న శిన్నూర్ గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో కల్లు అమ్మడం జరిగిందని, దీనిపై కరణంపల్లి గౌడ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఇక్కడ మాకు హక్కు ఉంది" అని కరణంపల్లి వాళ్లు, "మాకు కూడా హక్కు ఉంది" అని చిన్న శిన్నూర్ వాళ్లు వాదించుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు, గౌడ సంఘం సభ్యులు ఆలయం వద్ద సమావేశమై తమ వాదనలు వినిపించారు. ఇరు గ్రామాల పెద్దలు, సంఘం నాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ వివాదాన్ని పెద్దలు, అధికారులు చర్చించి శాంతియుతంగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్