ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ సర్పంచులు
రాయికోడ్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు రాయికోడ్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులందరూ కలిసి ఎంపీడీవో,ఎంఆర్ఓ ఆశదేవికి,ఎంపీవో సంతోష్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గ్రామ సర్పంచులను విస్మరించకుండా, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ చైర్మన్లుగా ఉన్న సర్పంచులు సమర్పించిన లబ్ధిదారుల జాబితాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వినతిపత్రంలో కోరడం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచులు ఇచ్చిన జాబితాలను పక్కనపెట్టి, అధికార పార్టీ నాయకులు ఇచ్చిన జాబితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదని, అర్హులైన పేద ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాలు హస్నాబాద్, రాయికోడ్, ఇటికేపల్లి, ఇందూర్,నాగన్‌పల్లి,సిరూర్, నలంపల్లి,సింగితం, పీపడ్‌పల్లి సర్పంచులు సమర్పించిన జాబితాలను పరిగణనలోకి తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారందరు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


