కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా
నాగర్ కర్నూల్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రామస్వామి కుటుంబానికి నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖ ఆర్థిక భరోసా అందించింది. పోలీస్ భద్రత వెల్ఫేర్ అసోసియేషన్ మంజూరు చేసిన రూ.5 లక్షల పర్సనల్ ఇన్సూరెన్స్ చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ఐపీఎస్ చేతుల మీదుగా ఈ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉండటమే శాఖ లక్ష్యమని తెలిపారు. అకాల మరణం చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కానిస్టేబుల్ రామస్వామి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఓ కృష్ణయ్య, ఆర్ఎస్ఐ గౌస్ పాషా, పోలీస్ కోఆర్డినేటర్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

