భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజి

భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజి

మెదక్, :  కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం మెదక్ ఆర్టీసీ బస్ డిపో నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ సర్వీసులను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీమతి పరమేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మెదక్ డిపో పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వివిధ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటు ధరల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కనీసం 30 మంది భక్తులు ఉంటే వారి ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సును పంపించే సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటు శబరిమల వెళ్లే భక్తుల కోసం కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం 9494825746, 9652577615, 9440792907, 9704885694 నంబర్లలో సంప్రదించాలని డిపో మేనేజర్ శ్రీమతి పరమేశ్వరి సూచించారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Views: 33

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్