గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

కష్టకాలంలో బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

మల్హర్‌,  :  మల్హర్‌రావు మండలంలోని పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని గాదంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బియ్యని మల్లయ్య, అన్నం కొమురయ్య, జోడు ఓధమ్మ కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టసమయంలో అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ప్రతి సందర్భంలో కుటుంబాలకు తోడుగా ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు, బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్, దుబ్బపేట సర్పంచ్ రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ బండారి సమ్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు నార రమేష్, లంబాడి హక్కుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా సమ్మయ్య, సీనియర్ నాయకులు ఇనగంటి నాగేశ్వర్ రావు, జక్కుల లక్ష్మణ్, బానోతు రాజు నాయక్, తోగరి శ్రీనివాస్, రాములు, మందపల్లి శ్రీధర్, గాదం సుధాకర్, ఇనుముల సతీష్, బానోతు రాజేందర్, నార సమ్మయ్య, బండారి శ్రీనివాస్, బండ రాజు, అజ్మీరా దేవేందర్, నార రవి, పెండ్యాల రాజు, కందుల రఘుపతి, మంత్రి రాజసమ్మయ్య, మందపల్లి రమేష్, దండిగా ప్రశాంత్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కష్టకాలంలో బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్