రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా
చిగురుమామిడి : సిద్దిపేట - హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె మహాన్వి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.మంగళవారం మృతుల స్వగ్రామమైన కొండాపూర్‌కు చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీకాంత్, మహాన్విల పార్థివ దేహాలకు పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు.ఒకే కుటుంబంలో యాజమానితో పాటు చిన్నారి కూతురు కూడా రోడ్డు ప్రమాద మహమ్మారికి బలికావడం అత్యంత హృదయవిదారకమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం మృతుల కుటుంబ సభ్యులను, బంధువులను కలిసి మంత్రి ఓదార్చారు.వారిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.గుండెకోతతో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని,అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అందే సురేష్,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్ గౌడ్,నాయకులు వంగర మల్లేశం,ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, బింగి రాజేంద్రప్రసాద్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులుగ్రామస్థులు పాల్గొని మృతులకు నివాళులర్పించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

