పేకాటలో దొరికిన కార్పొరేటర్​

పేకాటలో దొరికిన కార్పొరేటర్​

నిజామాబాద్ :  దీపావళి సందర్భంగా పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిజామాబాద్​ (Nizamabad) పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని ఆయా పోలీస్​స్టేషన్ల పరిధిలో నిరంతర నిఘా కొనసాగిస్తూ పలు పేకాట స్థావరాలపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 3వ టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మూడో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అర్సపల్లి బైపాస్​రోడ్​లో షేక్​ సలీం అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మంది షేక్​ సలీం ఇంట్లో పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. ఇందులో ఓ డివిజన్​ కార్పొరేటర్​ సైతం ఉన్నాడు. అనంతరం వారివద్ద నుంచి రూ.లక్షకు పైగా నగదు, 8 మొబైళ్లు స్వాధీనం చేసుకుని పోలీస్​స్టేషన్​ తరలించారు. అనంతరం నిజామాబాద్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరపర్చనున్నట్లు మూడో టౌన్​ ఎస్సై హరిబాబు తెలిపారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం.. పిఎసిఎస్ పాలకమండలిలో బహుజన రైతులకు అన్యాయం..
ఊరుకొండ : కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకమండలిని ఎన్నికలు నిర్వహించకుండా, తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 సెక్షన్ 32(7)(a) కింద జీవో ద్వారా...
ఆడపిల్ల పుడితే రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
కల్లు అమ్మకంపై రెండు గ్రామాల గౌడ సంఘాల మధ్య గొడవ
పొగాకు రహిత యువతే మనందరి లక్ష్యం
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
గాదంపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్