లట్టుపల్లి నుండి మహాదేవునిపేట వరకు డబుల్ రోడ్డు మంజూరు
గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరింది - ఎమ్మెల్యేకు సర్పంచుల ధన్యవాదాలు
బిజినపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరింది. లట్టుపల్లి నుండి మహాదేవునిపేట వరకు డబుల్ రోడ్డు మంజూరు కావడంతో గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. గ్రామస్తులు, సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన చొరవతో డబుల్ రోడ్డు మంజూరైంది.
ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి లట్టుపల్లి గ్రామానికి విచ్చేసి రోడ్డు పనులను పరిశీలించారు. చింతల్ భాయ్ దగ్గర ఒక అడుగు ఎత్తుతో కాంక్రీట్ రోడ్డు వేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. నాణ్యతలో రాజీ వద్దని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ రోడ్డు మంజూరు చేసినందుకు లట్టుపల్లి ఉమ్మడి తండా సర్పంచులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, సర్పంచులు మారేపల్లి చంద్ర గౌడ్, మూడవతు గోవింద్ నాయక్, పుల్యా నాయక్, కృష్ణ నాయక్, మాన్య నాయక్, మునీందర్ నాయక్, పండు నాయక్, రవి నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి నజీర్, వాలియా నాయక్, నాయకులు అమృత్ రెడ్డి, వెంకట్ స్వామి తదితర మండల నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

