కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.
గౌరవెల్లి,గండిపెల్లి ప్రాజెక్టుపనులు, కాల్వలు పూర్తి చేసి సాగు నీరు అందించాలి. హుస్నాబాద్ ను కరువు నియోజక వర్గంగా ప్రకటించాలి. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్.
హుస్నాబాద్ : ఓటు చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు,మాజీ శాసనసభ
పక్షనేత చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా శుక్రవారం రోజున హుస్నాబాద్ లోని అనభేరి, సింగిరెడ్డి అమరవీరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చాడ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో అనేక తప్పిదాలు జరిగాయని ఆరోపించారు.
మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించి హుస్నాబాద్ ప్రాంతం సాగుత్రాగునీటితొ సస్యశ్యామలం విరిజిల్లేందుకు గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్ల్ పనులతో పాటు గ్రామాలకు వరద కాల్వల నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయానికి సాగు నీరులేక వరి,పత్తి,మిర్చి మొక్కజొన్న వాణిజ్య పంటలు ఎండి పోయి రైతాంగానికి
తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ న్ని వెంటనే కరువు నియోజకవర్గంగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఎకరానికి
50 వేల నష్ట పరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గడిపె మల్లేశ్, కనుకుంట్ల శంకర్, జాగీర్ సత్య నారాయణ,పోతిరెడ్డి వెంకట్ రెడ్డి, కిష్టపురం లక్ష్మణ్,అందె అశోక్, వేల్పుల శ్రీనివాస్,గూడ పద్మ,బోనగిరి రూపేష్,ఈరి భూమయ్య, బత్తుల బాబు, జనగాం రాజ్ కుమార్, బెక్కంటి సంపత్, బోనగిరి శంకర్,గాంభీరపు మధు,జంగ విజయ,పొదిల కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ నుండి సిపిఐలో చేరిన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. : కొహెడ మండలం నాగ సముద్రాల గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గతంలో సిపిఐలో చురుకైన కార్యకర్తగా పని చేసి కొన్ని కారణాల వల్ల బిఆర్ఎస్ లో చేరాడు. శుక్రవారం రోజున సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సమక్షంలో తిరిగి మాతృ సంస్థ అయిన సిపిఐలో సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు తీగలకుంటపల్లికి చెందిన ఇట్టిరెడ్డి భగవాన్ రెడ్డితొ కలిసి
సిపిఐలో చేరారు.ఎర్ర కండువా కప్పి చాడ వెంకటరెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


